![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -21 లో... నా కూతురిని నా ఇంటికి పంపించండి అని రుద్ర ఇంటికి పైడిరాజు వచ్చి గొడవ పడుతుంటాడు. రుద్ర వచ్చి.. నీ కూతురు ఇక్కడ ఎందుకు ఉంటుందని కోప్పడతాడు. ఆ తర్వాత గొడవలో పెద్దసారు కింద పడబోతుంటే రుద్ర పట్టుకుంటాడు. రుద్ర కోపంతో పైడిరాజుని కొట్టబోతుంటే గంగ అడ్డుపడుతుంది. గంగని చూసిన రుద్ర షాక్ అవుతాడు. నా కూతురు ఈ ఇంట్లో లేదన్నారు కదా మరి ఇప్పుడు ఎలా వచ్చింది. నా కూతురుపై ఈ రుద్ర మోజు పడ్డాడు అందుకే ఇక్కడ ఉంచుకున్నాడని తప్పుగా మాట్లాడుతుంటే.. మా నాన్న తరుపున నేను సారీ అడుగుతున్నాను.. ఇంకెప్పుడు మీకు కన్పించనని చెప్పి గంగ పైడిరాజుని తీసుకొని వెళ్తుంది.
ఆ తర్వాత అందరు నన్ను చీట్ చేశారని రుద్ర అంటుంటే.. గంగ వస్తే మీ పెద్దమ్మ బాగవుతుందని అలా చేసాను. ఇప్పుడు భాను ఎక్కడ అంటే ఇప్పుడేం చెయ్యాలని పెద్దసారు బాధపడతాడు. అందరు లోపలికి వస్తారు. ఏమైందని శకుంతల అడుగుతుంది. భాను వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాలేకపోతే వాళ్ళ నాన్న వచ్చి తీసుకొని వెళ్ళాడని పెద్దసారు చెప్తాడు. నాకు బాగా దగ్గర అయింది. మళ్ళీ వస్తుందా అనీ శకుంతల అడుగుతుంది. వస్తుందని పెద్దసారు అంటాడు. అదంతా రుద్ర వింటాడు. మరొకవైపు ఒక చిన్నపాపకి దెబ్బ తాకుతుంది. రుద్ర హాస్పిటల్ కి తీసుకొని వెళ్లి తన బ్లడ్ ఇస్తాడు.
మరొకవైపు హాస్పిటల్ లో వీరు తమ్ముడు కోమాలో ఉంటాడు. వీరు వచ్చి నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఛాంపియన్ షిప్ లో నిన్ను ఓడించి ఇంతలా కొట్టాడు ఆ రుద్ర. మన నాన్న ఆ విజయేoద్ర వల్లే చనిపోయాడు.. వాళ్లపై పగ తెంచుకోవడానికి ఆ ఇంటికి అల్లుడు అయ్యానని తన తమ్ముడుని చూసుకుని అతనితో తన పగ చెప్తాడు. అక్కడే రుద్ర కన్పిస్తాడు. కావాలనే ఎదురుగా వెళ్లి ఏంటి ఇక్కడ అని అడుగుతాడు. ఒక చిన్న పాపని హాస్పిటల్ కి తీసుకొని వచ్చానని రుద్ర అంటాడు. తరువాయి భాగంలో పైడిరాజు కావాలనే తన భార్య టాబ్లెట్స్ పారేస్తాడు. దాంతో తను పడిపోతుంది. హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. తన ఇంజక్షన్ ఖర్చు వీరు మనిషి గంగని పెళ్లి చేసుకుంటానని చెప్పిన వ్యక్తి ఇస్తానని అంటాడు. మీరు ఎందుకు ఇస్తున్నారని గంగ అడుగగా ఇతనే నిన్ను పెళ్లి చేసుకునేది అని పైడిరాజు అనగానే గంగ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |